సంగారెడ్డి జనవరి 24 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లా కేంద్రంలోని పట్టణానికి చెందిన పలువురు విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో అత్యుత్తమ పురస్కారాలు దక్కాయి. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో గల బిర్లా మందిర్ సైన్స్ మ్యూజియం లో కేశవ్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ రైసింగ్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ పురస్కారాలు ఎం. రిత్విక్, ఎం.విశ్వేశ్వర్ లు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి, 14 ఇతర దేశాల నుంచి మార్షల్ ఆర్ట్స్ కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంతటి ఉత్తమ పురస్కారాలు తమ విద్యార్థులకు దక్కినందుకుగాను శిక్షకుడు పోచయ్య, తల్లిదండ్రులు క్రీడాకారులను అభినందించారు.