ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 22 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ పరిధిలోని స్థానిక ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో వివిధ కేసులలో జప్తు చేయబడిన 6 ద్విచక్ర వాహనములకు ఈ నెల 26 న ఉదయం 11 గంటలకు జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని ప్రోహిబిషన్ ఎక్సైజ్ సీఐ బాబా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల వారు వేలం పాటలో పాల్గొనవచ్చునని, వాహనాలకు సంబంధించి పూర్తివివరాలకు స్థానిక స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.