శుభం గార్డెన్స్ లో ప్రజా దర్బార్ సమావేశం.

మెదక్ మనోహరాబాద్ ప్రజా బలం న్యూస్:-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని శుభం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ ప్రజా వేదిక కార్యక్రమానికి ఉన్నత అధికారులు పాల్గొని ప్రజావేదికలో మండలంలోని వివిధ గ్రామాల వారీగా నాటిన హరితహారం మొక్కలపై మరియు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని కొన్ని గ్రామాలలో ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్నటి వరకు కేటాయించిన నిధులు 9,28,47,789. నిధులను అభివృద్ధి కార్య క్రమాలపై వెచ్చించడం జరిగిందని ఇందులో చిన్నపాటి తప్పిదాల వలన కొన్ని గ్రామపంచాయతీ సెక్రెటరీలకు అపరాధ రుసుములు వేయడం జరిగింది. ఇకమీదట ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని మనోహరబాద్ మండల ఎంపిపి పురం నవనీత రవీ ముదిరాజ్ ప్రభుత్వ అధికారులు పేర్కొంటూ ఇలాంటి విషయాలను కొద్దిపాటి జాగ్రత్తలు వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెచ్చించిన నిధులకు తగిన ప్రతిఫలాన్ని అందించే విధంగా గ్రామ సెక్రెటరీ పని చేయాలని వారు ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన నాతోటి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డి వి ఓ శ్రీహరి, క్వాలిటీ కంట్రోలర్ రమాకాంత్, అంబుర్మెంట్ ప్రభాకర్, ఎంపీపీ పురం నవనీత రవి,
వైస్ ఎంపీపీ విటల్ రెడ్డి, ఎంపీడీవో యాదగిరి రెడ్డి, ఏపీవో ఆదినారాయణ, టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, పంజా బిక్షపతి, నీరు గంటి ఆంజనేయులు, సర్పంచ్ పూల అర్జున్, సర్పంచ్ మాధవరెడ్డి, రేణు కుమార్, పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ ఆఫీసర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking