మహిళా లను రక్షించ లేని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చెయ్యాలి– అడ్వకేట్ జగన్ మోహన్ బి.ఎస్.పి నిర్మల్ జిల్లాఅధ్యక్షులు.

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మణిపూర్ లో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన మానవ మృగాలకు ఉరిశిక్ష అమలు చేయాలని,
మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన సర్వసభ్య సమాజం తలదించుకునేలా చేసిందని, మహిళలను నగ్నంగా రహదారులపై తిప్పుతూ రాక్షస ఆనందం పొందిన మానవ మృగాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష అమలు చేయాలని నిర్మల్ నియోజకవర్గంలో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది..
ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ ప్రసంగిస్తూ మాట్లాడుతూ మహిళలను నగ్నంగా రహదారులపై తిప్పుతూ రాక్షస ఆనందం పొందిన మానవ మృగాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ష తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రధాన మంత్రి మోడీ గారు మౌనంగా ఎందుకు ఉన్నారు అని,దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో బి.ఎస్.పి
జిల్లా జనరల్ సెక్రటరీ గుండా సతీష్,
షేక్ అలీమ్ టౌన్ వైస్ ప్రెసిడెంట్.
మహిళా కన్వీనర్ లక్ష్మి. బి.ఎస్.పి కార్మిక విభాగం సీనియర్ నాయకులు పడిగల రాజేష్, గంగా మనీ, కరుణ.నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking