తూప్రాన్, జులై 22 (ప్రజా బలం న్యూస్):
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్ర ఎప్డీసి చైర్మన్ వంటెర్ ప్రతాప్ రెడ్డి సమక్షంలో తూప్రాన్ మున్సిపల్ 10 వ. వార్డ్ కౌన్సిలర్ రవీందర్ రెడ్డి ప్రోద్బలంతో బిఆర్ఎస్ పార్టీలో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మీదట పార్టీకి కట్టుబడి పని చేస్తామని చేరిన కార్యకర్తలు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మామిళ్ల జ్యోతి కృష్ణ, ప్రభాకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.