న్యూఢిల్లీ జూలై 22 (); నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారం ను బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణు మాధవ్ భేటీ అయ్యారు ఈ సందర్బంగా చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం గత 50 సంవత్సరాలుగా అనేక రకాలుగా పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం గత 50ఏళ్ళు గా బిసి ఉద్యమ వివరాలను వాటి ద్వారా సాధించిన స్థానిక రిజర్వేషన్ల అంశం హాస్టల్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు ఫీజు రియంబర్స్మెంట్ విజయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పలు డిమాండ్లను చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు సమగ్ర కుల గణన జరగాలని కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇలాంటి అనేక విషయాలు కర్రి వేణు మాధవ్ హన్సరాజ్ గంగారం ద్రుష్టి కి తీసుకెళ్ళారు.