మెదక్ ప్రాజబలం డిసెంబర్ 12 న్యూస్ :-
మెదక్ పట్టణంలో
ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో మెకానిక్ వర్క్ షాప్ కార్మికుల సమక్షంలో ఆటో, ట్రాక్టర్ మెకానిక్ వర్క్ షాప్ కార్మిక యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆటో మెకానిక్ వర్క్ షాప్ యూనియన్
అధ్యక్షులుగా
ఎండి ఆసిఫ్ పటేల్
ఉపాధ్యక్షులుగా
ఎం హీరోలాల్
ప్రధాన కార్యదర్శిగా ధనరాజ్
జాయింట్ సెక్రటరీ గా
ఏ. ప్రవీణ్ కుమార్
కోశాధికారిగా .
బాలకిషన్
ఎగ్జిక్యూటివ్ నెంబర్ సజావుద్దీన్
గణేష్, ఎజాస్ , షేక్ ,ఇక్బాల్ , జనార్దన్ గౌడ్, కమ్మరి నవీన్ చారి, ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా నియమించడం జరిగింది.
వారు మీడియాతో మాట్లాడుతూ గత 35సంవత్సరాల నుండి ఉమ్మడి రాష్ట్రం మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పటినుండి మెదక్ లో ఆటోనగర్ కాలనీ ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారుగా మొత్తం 300 షాపులు ఉన్నాయని ఆటో మెకానిక్. వెల్డింగ్. ఎలక్ట్రిషన్. ఆటోమొబైల్ షాప్స్ గతంలో రాందాస్ చౌరస్తా ఉన్న షాపులు ప్రస్తుతం మంబోజి పల్లి వరకు వెళ్లిన మాకు చాలా ఇబ్బందిలు ఉన్నాయని మేము పని చేసుకోవడానికి సరియైన స్థలము లేక మా దగ్గరకు వచ్చిన కస్టమర్ వాహనాలకు పోలీస్ చానల్స్ పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేము మొత్తం 300 షాపులు అనగా 3000 వేల మంది ఉన్నామని మా జీవన ఉపాధి ఇదేనా అని మాకు వెంటనే ఆటోనగర్ నిర్మాణం జరగాలని స్థానిక ప్రజాప్రతినిధులను , స్థానిక ఎమ్మెల్యే ను , ప్రభుత్వ పెద్దలను అధికారులను కోరారు.