మళ్ళీ మోదీయే ప్రధాని

లోక్ సభ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 12 : కేంద్రంలో మళ్ళీ మోదీయే ప్రధాని అవుతారని,లోక్ సభ ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా బీజేపీ రైతాంగ సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన తమను రెండో స్థానంలో నిలిపిన ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.డబుల్ బెడ్ రూమ్ కోసం పోరాడమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నమన్నారు.ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వి హరిగోపాల్,జగన్మోహన్ రెడ్డి, వేముల మధు,బొప్పు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking