ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్12:కాజీపేట రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు కాజీపేట విష్ణుపురిలోని రిటైర్డ్ రైల్వే ఉద్యోగస్తుల కార్యాలయంలో స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో సంఘం అద్యక్షులు సంగమయ్య మాట్లాడుతూ విశ్రాంత రైల్వే ఉద్యోయస్తుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కోరారు.ఈ సంధర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మీ అందరూ నాకు సహాయ సహాకారాలు అందించి నా గెలుపుకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాజీపేట రైల్వే ఉద్యోగస్తులకు మరియు రిటైర్డ్ ఉద్యోగస్తులకు నేను ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు.కాజీపేటను గతంలో ఉద్యమం పేరుతో గత శాసన సభ్యులు కాజీపేట ప్రాంతాన్ని వాడుకోవడం జరిగిందని,కానీ అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేశారని అన్నారు.వీలైనంత త్వరలో మాస్టర్ ప్లాన్ రెడీ చేసి అభివృద్ధి చేస్తానాని హామీ ఇచ్చారు. అధెవిధంగా రైల్వే సమస్యలు,రిటైర్డ్ ఉద్యోగులకు ఏమయినా సమస్యలు ఉంటే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,సయ్యద్ విజయశ్రీ రజాలి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్,సయ్యద్ రజాలి, మాజీ కార్పొరేటర్లు గుంటి కుమార్, డివిజన్ అద్యక్షులు షేక్ అజ్గర్, పి.ఆంజనేయులు,శివ కుమార్,క్రాంతి భారత్,రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అద్యక్షులు సంగమయ్య,సెక్రెటరీ కె.వి.రావు,కోశాధికారి కె.ఐలయ్య, ఏం.డి.జహాంగీర్,కె.సమ్మయ్య,ఎస్ఎం అఫ్జర్,పి.యాదయ్య,డి.సురేందర్, ఎస్.రాములు,బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.