మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్:-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం యుపిఎస్ కిష్టాపూర్ పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు స్వయం పాలన దినోత్సవ వేడుకలు( సెల్ఫ్ గవర్నమెంట్ డే సెలబ్రేషన్స్) ఘనంగా జరుపుకున్నారు. డీఈవోగా విష్ణు,ఎంపీడీఓగా రేష్విక, ఎమ్మార్వో గా నందిని, ఎంఈఓ గా చిదివిలాస్, డిప్యూటీ డీఈవోగా పురోషోత్తం. హెడ్మాస్టర్ గా నిశాంత్, అటెండర్గా, అఖిల్. ఉపాధ్యాయులుగా అమూల్య, అక్షర, రుచిత, అఖిల్, విశాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్లొరి లక్ష్మణ్ ఉపాధ్యాయులు విజయ, అనురాధ ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.