కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి
టీయస్పియస్సీ కార్యాలయం వద్ద బీజేవైఎం ధర్నా..డిమాండ్
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ మార్చ్ 14బీతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో సూత్రధారులైన అధికారులందరిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు భాను ప్రకాష్ అధ్వర్యంలో నాంపల్లి లోని టీయస్పియస్సీ కార్యాలయం ధర్నా చేసారు. ఈ సందర్బంగా బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ…. ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగుల, యువకుల, విద్యార్థుల జీవితాలకు ముడిపడినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాలు లీక్ కావడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తోంది. వందలాది మంది యువకులు, విద్యార్థుల ప్రాణత్యాగంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైన %ుూూూజ% ఇచ్చిన నోటిఫికేషన్లలో తప్పుడు ప్రశ్నలు, నియమాలు, నిబంధనలను తప్పులు తడకగా మార్చి, గ్రామీణ పేద విద్యార్థులు, అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, చివరికి కనీసం ప్రశ్న పత్రాలను రక్షించడంలో తమ చేతగాని తనాన్ని, అలసత్వాన్ని బహిర్గతం చేశారు.

బిజెవైఎం ఎన్నో పోరాటాల ఫలితంగా లేకలేక వచ్చిన నియామకాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీక్ అవ్వడాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తూ, ఘటనకు నైతిక బాధ్యత వహించి చైర్మన్ జనార్దన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, ప్రశ్నపత్రల లీక్ లో నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయాలని బిజెవైఎం డిమాండ్ చేస్తోందన్నారు.
బోర్డు తీరు, వ్యవస్థ చూస్తే ఈ రెండు పరీక్షలు మాత్రమే కాకుండా గతంలో జరిగినటువంటి పరీక్షలు మీద కూడా అనుమానాలకు తావి స్తోంది. నిరుద్యోగుల, అభ్యర్థుల భవిష్యత్తును, జీవితాలను అన్యాయం చేస్తూ, కుటుంబాలను ఆగం పట్టించే విధంగా వ్యవహరిస్తున్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు సిబ్బంది అధికారుల పాత్ర మీద సమగ్ర విచారణ జరిపించాలని, అందులో ప్రమేయం ఉన్నటువంటి అధికారుల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే టీఎస్పీఎస్సీ కి సంబంధించిన చైర్మన్ మరియు లీక్ లో ప్రమేయం ఉన్న అధికారులను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు.భాను ప్రకాశ్ సహా బిజెవైఎం నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించార్టు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధన కార్యదర్శి అరుణ్ కుమార్ , బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు నవీన్ రెడ్డి , బీజేవైఎం మాధపూర్ డివిజన్ అధ్యక్షులు ఆనంద్ కుమార్, బీజేవైఎం మాధపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శివా యాదవ్ , బీజేవైఎం మియాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు వెంకట్ , బీజేవైఎం కొండాపూర్ డివిజన్ ఉపాధ్యక్షులు కార్తిక్ , బీజేవైఎం నాయకులు లోకేష్ , నాని , రాము సింగ్ , బలరాం మరియు ఇతరులు పాల్గోన్నారు.