జిల్లా వైద్య , ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో “ఆయుష్మాన్ భారత్”

రాజన్న సిరిసిల్ల జిల్లా 14,మార్చి2023, ప్రజాబలం ప్రతినిధి ఆంజనేయులు
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాదికారి డా. ఏ. సుమన్ మోహన్ రావు ఆద్వర్యంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమములో భాగముగా స్కూల్ హెల్త్, వేల్ నెస్ కార్యక్రమము పై అవగాహన కొరకు వైద్య , ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రతి మండలములో నలుగురుని ఎంపిక చేసి (2) రోజులు శిక్షణ ఇవ్వడం జరిగినది.
ఈ శిక్షణ కార్యక్రమములో డా. ఏం. మహేష్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి గారు మాట్లాడుతూ స్కూల్ హెల్త్ , వేల్ నెస్ పై శిక్షణ లో భాగముగా స్కూల్ విద్యార్థులకు ఆరోగ్యముగా, మానసికముగాఎదగడం,పోషకాహారం,పరిసరాల పరిశుభ్రత, లింగ బేదం లేకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, ఇంటర్నెట్, గాడ్జెట్లు మరియు మీడియా యొక్క సురక్షిత వినియోగాన్ని ప్రోత్సహించడం, పునరుత్పత్తి ఆరోగ్యం మరియు హెచ్, ఐ , వి / ఏయిడ్స్ పై నివారణ మొదలగు అంశాల పై అవగాహన కల్పించాలని కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమములో ట్యూటర్లుగా,డా.నయిమా, డా. ప్రభాకర్, మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి దేవయ్య, తిరుపతి రెడ్డి,సంతోష్,రవి, బాలయ్య హెల్త్ ఎడ్యుకేటర్ ,సంపత్ హెచ్. యి ఓ గార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking