ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ,
ఎఫ్ డి సి చైర్మన్
వంటేరు ప్రతాప్ రెడ్డి
హాజరైన ప్రజాప్రతినిధులు.
నాచారం గుట్ట ప్రజాబలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్రంలో రెండవ యాదగిరిగుట్ట గా ప్రసిద్ధి చెందిన నాచారం గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మహోత్సవం కనుల విందుగా కొనసాగింది. ముందుగా గర్భ లయంలో కలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేపితుడైన లక్ష్మీ నరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక వాహనంపై ఉంచి బజా భజంత్రీ ల మధ్య ఎదురుకోలు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ యాదవ రెడ్డి దంపతులు, అటవీశాఖ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దంపతులు, కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంనుండి కళ్యాణ వేదిక వరకు లక్ష్మీనరసింహస్వామి ని ఊరేగింపుగా తీసుకువెళ్లి కళ్యాణ మండపంలో కళ్యాణ వేదిక వై ఉంచి వేద బ్రాహ్మణులు కళ్యాణతంతు నిర్వహించారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీతం, మధుపర్కం, జిలకర బెల్లం, మంగళసూత్రధారణ ,తలంబ్రాలు, ఓడి బియ్యం, వంటి కళ్యాణ కార్యక్రమాలు వేద మంత్రాల మధ్య బజభజంత్రీల వ్మధ్య నయానందంగా కొనసాగింది. ఇటీ నాచగిరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి జిల్లా నుండిఉమ్మడి మెదక్ జిల్లాల నుండి కాకుండా జంట నగరాల నుండి ,మహారాష్ట్ర కర్ణాటక నుండిబ్భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలి వచచ్చి కళ్యాణాన్ని వీక్షించి తరించారు భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని అలాగే వసదిగ్గృహాలు సైతం అందుబాటు లో ఉంచామని ఆలయ ఈవో మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో నాచారం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు నాయకులు పైనమ్ వెంకటేష్, గడ్డం ప్రశాంత్ కుమార్, నరసింహారెడ్డి, యాదగిరి గౌడ్, కొడిపాక వెంకటేశం గుప్తా, మామిడి వెంకటేష్, కృష్ణ, మాజీ డైరెక్టర్లు, వేద పండితులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.