రాజేంద్రనగర్ ప్రజాబలం ప్రతినిధి:ఈరోజు మణికొండ లో AVOPA రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు స్రవంతి ఆధ్వర్యంలో జరిగినటువంటి మహిళా సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా AVOPA రాష్ట్ర అధ్యక్షులు మల్లిపెద్ది శంకర్ , మహిళా అధ్యక్షురాలు శిల్ప , జనరల్ సెక్రెటరీ కట్ట రవి కుమార్ మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో మలిపెద్ది శంకర్ మాట్లాడుతూ హిందూ ధర్మము మహిళల పాత్ర కుటుంబ పోషణలో గాని సమాజాభివృద్ధిలో గాని వారు చేస్తున్న కృషిని అభినందించడం జరిగింది.
మరియు ఈరోజు సమాజంలో జరుగుతున్న కొన్ని చెడు సంఘటనలకు మూల కారణమైనటువంటి జీవన విధానాన్ని ఈ విధంగా మార్చుకోవాలి అనేవి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
బొడ్డు శ్రీధర్ మాట్లాడుతూ మణికొండలో రాబోయే రోజుల్లో వాసవి అమ్మవారి గుడి నిర్మాణంలో మహిళలు పోషించబోయేటువంటి పాత్ర గురించి వివరించడం జరిగింది