రోడ్డు పనులకు మోక్షం ఎప్పుడో

 

ప్రజాబలం ప్రతినిధి అందోల్ నియోజకవర్గం ఫిబ్రవరి 22 అందోల్ నియోజకవర్గం లోని రాయికోడ్ మండల పరిధిలోని మైబద్పూర్ మనూర్ మండల పరిధిలోని రాయిపల్లి నుండి శిరూర్ వరకు రోడ్లపై కంకర పోసి నిలిపివేయడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది రోడ్డుపై పోసిన కంకరపై ద్విచక్ర వాహనదారులు స్కిట్ అయిపోయి పోతున్నారు సుమారు రాయిపల్లి బ్రిడ్జి నుండి మైబత్పూర్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు ఉన్నప్పటికీ దాంబర్ ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు ప్రతిరోజు నిత్యం తిరిగే ప్రయాణికులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రోడ్లపై తిరగాలంటే భయపడుతున్నారు రోడ్లపై వెళ్తున్న సమయంలో దుమ్ము రావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు జంకుతూ ప్రయాణాలు చేస్తున్నారు అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేయాలని పలువురు ప్రయాణికులు కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking