రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి-22 (ప్రజాబలం ప్రతినిధి)
రోజు రోజుకు పెరుగుతున్న సైబన్ నేరాలను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే వెంటనే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ కి పిర్యాదు చెయ్యండి.ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ….ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు క్రైప్టో/ బిట్ కాయిన్ ఫ్రాడ్, పరమిడ్/ మల్టీ లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్, జంప్డ్ డిపాజిట్ ఫ్రాడ్,నకిలీ విద్యుత్ బిల్లుల మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, రుణ యాప్‌ల మోసాలు,ఆన్లైన్ పే మెంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, నకిలీ సిమ్ కార్డ్స్, లోన్ యాప్స్, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్,నకిలీ వెబ్ సైట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈవారం రోజులో జరిగిన కొన్ని సైబర్ నేరాలు….
1.ఒక వ్యక్తికి ఒక అపరిచిత వ్యక్తి నుండి మెసేజ్ రావడం జరిగింది ఈ మెసేజ్ లో భాగంగా వ్యక్తి యొక్క ఆర్థిక సంబంధిత సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి వ్యక్తి దగ్గర నుండి 30 వేల రూపాయలు తీసుకోవడం జరిగింది.
2. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి ఆర్బిఐ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి ఇన్సూరెన్స్ పెండింగ్ ఉందని చెప్పి వాట్సాప్ లో ఒక లింక్ పంపించగా బాధితుడు ఆ లింక్ క్లిక్ చేసి క్రెడిట్ కార్డు ఎంటర్ చేయడంతో 50,000 రూపాయలు నష్టపోయాడు.
3. సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఎస్బిఐ రివైట్ పాయింట్స్ రీడింగ్ కోసం అని చెప్పి ఒక ఏపీకే ఫైల్ రావడంతో దాన్ని క్లిక్ చేసి అందులో ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ లాగిన్ దానితో పాటు ఓటి ప్రింటర్ చేయడంతో 5000 నష్టపోయాడు.
4.ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి ఒక అన్న నెంబర్ నుంచి హైజిన్స్ కోసం అని చెప్పి ఎస్బిఐ క్రెడిట్ కార్డు సంబంధిత యాప్ పంపిస్తున్నామని చెప్పడంతో బాయదురా ఇన్స్టాల్ చేసుకుని అతని యొక్క క్రెడిట్ కార్డు డీటెయిల్స్ మరియు ఓటీపీ షేర్ చేసుకోవడంతో 20,000/- రూపాయలు నష్టపోయాడు.