అట్టహాసంగా జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

 

చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ పేరిట మెగా టోర్నీ

టాస్ వేసి పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్

విజేతకు దక్కనున్న రూ. 2.50 లక్షల నగదు బహుమతి

ఖమ్మం ప్రతినిది ఫిబ్రవరి 22 (ప్రజాబలం)
ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఖమ్మం వేదికైంది. అట్టహాసంగా ప్రారంభమైన టెన్నిస్ టోర్నమెంట్ ను చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ పేరిట మెగా టోర్నీ ఆరంభమైంది. కాగా టాస్ వేసి పోటీలను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు ఈ మెగా టోర్నమెంట్ లో విజేతకు రూ. 2.50 లక్షల నగదు బహుమతి దక్కనుంది. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయిచల్లపల్లి రాధమ్మ మెమోరియల్ నేషనల్ మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రజామిల్ ఖాన్ టాస్ వేసి మొదటి మ్యాచ్ ను ప్రారంభించారు. ఖమ్మం వేదికగా ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి ఒకటి వరకు జరగనున్నది నేషనల్ మెన్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ… టెన్నిస్ క్రీడ మనిషిలోని నైపుణ్యతను, క్రీడస్ఫూర్తిని చాటుతుందన్నారు. ప్రధానంగా మిగతా క్రీడలతో పోల్చితే టెన్నిస్‌ లో ఎక్కువగా స్నేహభావం, పోటీ తత్వం, మానసిక పరిపక్వత, అన్ని కలగల్సి ఉంటాయని ఆయన అన్నారు. టెన్నిస్ క్రీడలు మనిషిలో పోరాట తత్వాన్ని నేర్పుతాయని కలెక్టర్ అన్నారు. టెన్నిస్ క్రీడను అభివృద్ధి చేయడం ఖమ్మం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ అన్నారు ఇంత మంచి కోర్టు, ఇంత మంచి టెన్నిస్ వాతావరణం ఏర్పాటు చేసుకోవడం మన జిల్లాలో ఉన్న టెన్నిస్ అసోసియేషన్ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు రాబోవు రోజుల్లో మరింతగా మన క్రీడా స్ఫూర్తిగా చాటుకునేలాగా టెన్నిస్ క్రీడను అభివృద్ధి చేసుకుందామని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి జాతీయ మ్యాచ్‌ను కర్ణాటకకు చెందిన ఆర్యన్ మెహతా మహారాష్ట్రకు చెందిన ఆదిత్య రానావడే అనే ఇద్దరు క్రీడాకారుల మధ్య తొలి మ్యాచ్‌ను కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చల్లపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కాసినేని, ట్రెజరర్ కాంపాటి సత్యనారాయణ, డిఎస్ డీ ఓ టి సునీల్ రెడ్డి, చీఫ్ రిఫరీ ప్రవీణ్ నాయక్, అడిషనల్ ఎస్పీ కుమారస్వామి, ఖమ్మం నగర ప్రముఖులు కాళ్ల పాపారావు, ట్రాఫిక్ సిఐ సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, కాళ్ల సూర్య, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking