మనోహరాబాద్ – ప్రజా బలం న్యూస్
రహదారి భద్రత, తక్షణ చర్యలు అంశంపై గురువారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మనోహరబాద్ మండలం లోని ప్రవెట్ ఫంక్షన్ హాల్ లో ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రహదారి భద్రత గురించి రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వ్యక్తులకు అందించాల్సిన తక్షణ చికిత్సలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, వాహనాలను నడిపే సందర్భాలలో లైసెన్సులను అందుబాటులో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంఆర్ఐ డిఎస్పి చంద్రబాను, తూప్రాన్ సీఐ శ్రీధర్ ఎస్సై సందీప్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, పొలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.