11న స్వర సుధా మ్యూజిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘంటసాల 49వ వర్ధంతి వేడుకలు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 09 (ప్రజాబలం) ఖమ్మం
ఘంటసాల గానామృత సినీ సంగీత విభావరి మరియు స్వర సుధా మ్యూజిక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ స్వర్గీయ ఘంటసాల 49వ వర్ధంతి సందర్భంగా స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం ఘనంగా ఘంటసాల వర్ధంతి వేడుకలు జరుగుతాయి అన్నారు . ఈ వేడుకలు సాయంత్రం ఐదు గంటల నుండి కొనసాగుతాయని కళాతపస్వి , సినీ దర్శకుడు కె విశ్వనాథ్ , పద్మ భూషణ్ శ్రీమతి జమున ( ప్రముఖ సినీనటి ) , పద్మ భూషణ్ శ్రీమతి వాణి జయరాం ( ప్రముఖ గాయని ) ల సంస్మరణలు తెలియజేస్తూ మధుర గీతాలు ఆలపిస్తారని తెలియజేశారు . కావున కళాభిమానులు , కళాకారులు మొదలగు వారు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పారుపల్లి సురేష్ , ముఖ్య సలహాదారులు శ్రీమతి వనం కృష్ణవేణి , అధ్యక్షులు కొమర్రాజు మాధవరావు , ఉపాధ్యక్షులు వివి రెడ్డి , కోశాధికారి పి జె వినయ్ కుమార్ , ఆర్గనైజర్ సెక్రటరీ వి శ్రీనివాసరావు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking