ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 29 :
మందమర్రి మండలంలోని శంకర్ పల్లి గ్రామంలో గల రైతు వేదిక లో మంగళవారం రైతు చట్టాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి హరిత మారంరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా రైతులకు హక్కులు, సమస్యలపై సలహాలు, ఉచితంగా న్యాయ సేవలు, రైతు పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఈ.డి భాను ప్రసాద్,ఎమ్మార్వో ఎంపీడీవో రాజేశ్వర్, ఏవో కిరణ్ మహీ, ఏ ఈ ఓ. తిరుపతి, ఏపీవో రజియా సుల్తానా, మాజీ ఎంపీపీ మంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు సోదరి పున్నం, కోట రాజలింగు, కుమ్మరి తిరుపతి, కమల మోహన్ రావు, గందె రామచందర్, ఆసంపల్లి రాజన్న, ఫీల్డ్ అసిస్టెంట్లు జిల్లా అధ్యక్షుడు ఈధ లింగయ్య, లింగాల రాజేందర్, పుస్తె రవి, శెట్టి సత్యనారాయణ ఫీల్డ్ అసిస్టెంట్ లు, అన్ని గ్రామ పంచాయతీల రైతులు పాల్గొన్నారు.
