ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 29:
మందమర్రి మండలంలోని క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని గల క్యాతన్ పల్లి రైల్వే గేటును వారం రోజులు మూసి వేయనున్నట్లు మంగళవారం రైల్వే శాఖ అధికారులు తెలిపారు. మూడో రైల్వే నిర్మాణ పనుల్లో భాగంగా నవంబర్ 1నుండి 7 వరకు క్యాతన్ పల్లి గేట్ ను మూసివేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు, ప్రయాణికులు రైల్వే శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.