ప్రధాన మంత్రి ఆయుషన్ భారత్ మరియు ఈ – శ్రమ్ కార్డులు పై అవగాహన

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 15 (ప్రజాబలం) ఖమ్మం అర్బన్ టేకులపల్లి ప్రాంతంలో బుధవారం ప్రధాన మంత్రి ఆయుషన్ భారత్ మరియు ఈ – శ్రమ్ కార్డులు గురించి అవగాహనను బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి దొడ్డ అరుణ , డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి అనితా రెడ్డి పాల్గొని మాట్లాడారు . ప్రతి పేదవాడికి కార్పొరేటర్ వైద్యం అందించాలని ఆశయంతో మన ప్రియతమ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈ పథకం తీసుకొచ్చారని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అర్హులే అని , ఆస్పత్రిలో చేరిన అనంతరం నగదు చెల్లించాల్సిన అవసరం లేదు అని , ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ పథకం పనిచేస్తుంది . కుటుంబ పరిమాణం , వయసు లేదా లింగం పై ఎలాంటి ఆంక్షలు లేవు , ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదైన తొలి రోజు నుండే ఈ పథకం ద్వారా వైద్యం చేసుకోవచ్చు . కావలసిన డాక్యుమెంట్లు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ కు లింక్ అయి ఉండాలని లేదా ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు కానీ ఉండాలి . వయస్సు 0 నుండి 80 సంవత్సరాల వరకు అర్హులు వెంటనే మీ దగ్గర లోని CSC గానీ మీ సేవ లో గాని నమోదు చేసుకోవాలని కోరారు . దేశంలో ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా ఒక్కో కుటుంబం ఒక్కో ఏడాది రూ. 5 లక్షల వరకు చికిత్స చేయించుకోవచ్చన్నారు. అలాగే ఈ – శ్రమ్ కార్డులో నమోదయి ఉంటే అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ గానీ , నార్మల్ డెత్ కానీ అవుతే 2 లక్షల రూపాయలకు బీమా వర్తిస్తుందని అన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking