ఖమ్మం ప్రతినిధి మార్చి 15 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ నందు ఖలీల్ అండ్ బ్రదర్స్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన కేపీఎల్ కింగ్స్ ప్రీమియర్ లీగ్ ఖమ్మం జిల్లా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ హాజరై కింగ్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు
అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీల్లో పాల్గొన్న జిల్లా జట్టులకు కరచాలనం చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ముఖ్య అతిధులు అందరికీ కింగ్స్ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్స్ సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ కార్పొరేటర్లు బుడిగం శ్రీనివాసరావు బుర్రి వెంకట్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్ నాయకులు తాజ్ ఫక్రు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.