పేద ప్రజల ఆరోగ్యం పట్ల సిఎం సహాయం సంజీవని
మెదక్ తూప్రాన్ ప్రాజ బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామానికి చెందిన నీలం కుమార్ స్థానిక ప్రాజప్రతినిధుల సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా బుధవారం నాడు శ్రీశైలం గౌడ్
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
తూప్రాన్ మండలంకు చెందిన నీలం కుమార్ కు 60000
రూపాయలు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కు ను అందజేసిన మెదక్ జిల్లా మంత్రి హరీష్ రావు వీరాభిమాని సిందే చంద్రం, తూప్రాన్ మండల
బిఆర్ ఎస్ నాయకులు బాయికాడి ఆంజనేయులు ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆపత్కాలంలో ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్, మంత్రివర్యులు హరీష్ రావు కు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు, ముఖ్యమంత్రి సహాయనిధి ఆపత్కాలంలో ప్రాణాలు నిలిపే సంజీవని అన్నారు,ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి ఈ డబ్బులు కొండంత అండగా ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్, కానుకుంట
బాలకృష్ణ గౌడ్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.