200 కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ,అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు,తన్నీరు హరిష్ రావు,ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్,దుర్గం చిన్నయ్య

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల నిధులతో సంక్షేమ,అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కు ముఖ్య అతిథులుగా పాల్గొన మంత్రులు,తన్నీరు హరిష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమాన్,దుర్గం చిన్నయ్య,కలిసి ప్రారంభించారు,బుధవారం ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… గడిచిన 60 ఏళ్లలో చెన్నూరు నియోజకవర్గాన్ని ఏ నాయకుడు పట్టించుకున్న పాపాన పోలేదు,దశాబ్దాలుగా అభివృద్ధి సంక్షేమం అందక దారుణ పరిస్థితి ఏర్పడ్డాయి,ఎన్ని నియోజకవర్గాన్ని 30 ఏళ్లు కాంగ్రెస్ 20 ఏళ్లు టిడిపి బిజెపిని పాలించిన ఎంతో వెనుకబాటుకు గురైంది,
1952 నుండి చెన్నూరు నియోజకవర్గంలో గెలిచిన నాయకులందరూ ఇక్కడ ప్రజలు అమాయకత్వంతో గెలిచినారు, అడ్డగోలుగా ఆరోపించే విపక్ష నాయకులు 50 ఏళ్లుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు,అధికారంలో ఉండి కూడా అభివృద్ధి చేయకుండా మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు,నూరు నియోజకవర్గానికి త్రాగునీరు,సాగునీరు ఎందుకు తీసుకురాలేదు,మోడీ సహకరించక పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో చెన్నూరు అభివృద్ధి యజ్ఞం కొనసాగుతుంది.కమిషన్ భగీరథ కోసమే 160 కోట్లు ఖర్చు పెడుతున్నాము.త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1600 కోట్లతో చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన,ఇంత గొప్పగా చెన్నూరు అభివృద్ధి యజ్ఞం కొనసాగుతుంటే దమ్ము లేక విపక్ష నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారు,మంత్రిగా వినోద్ ఉన్నప్పుడే సింగరేణి బొగ్గు భాగులు మూతపడ్డాయి అన్నది వాస్తవం కాదా,2014-19 వరకు ఎంపీగా ఉన్న వివేక్ ఈ నియోజకవర్గానికి చేసింది ఏమిటి,1952 రెండు నుండి వెంకటస్వామి గెలుపుతో ఈ నియోజకవర్గంలో వాళ్ళ అరాచకం మొదలయ్యింది.వేరే రాష్ట్రాల్లో ఆస్తులు,అంతస్తులు,ఫ్యాక్టరీలు సంపాదించుకొని కోట్లకు పడగలెత్తారు.చెన్నూరు పట్టణంలో అంతర్గత రోడ్లు కాలువల నిర్మాణానికి అదనంగా 25 కోట్లు మంజూరు చేయాలని మంత్రి గారిని కోరారు.గాంధీ చౌక్ వద్ద నిర్మిస్తున్న దవాఖానను మాతా శిశు ఆసుపత్రిగా మార్చాలని కోరారు, రామకృష్ణాపూర్,చెన్నూర్,భీమారంలో పిఎచ్ సి సెంటర్లను ఏర్పాటు చేయాలి,పారుపల్లి,ఆస్నాద్ లను కొత్త మండలాలుగా,చెన్నూరును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి,కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, వృద్ధిరేటులో దూసుకుపోతుంది,తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధి మిగతా ఏ రాష్ట్రాల్లో లేవు,సుభిక్షంగా పచ్చగా ఉన్న తెలంగాణను చూసి బిజెపి కళ్ళు మండుతున్నాయి.తెలంగాణ గుజరాత్ రాష్ట్రం కన్నా గొప్పగా అభివృద్ధి చెందుతుంటే చూసి ఓర్వలేక పోతున్నారు,బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే మా నాయకులపై ఐటి,ఈడి, సీబిఐ, దాడులు చేస్తున్నారు,బిజెపి కేసులకి భయపడేది లేదు,కెసిఆర్ ని మానసికంగా వేధించే కుట్రలో భాగంగానే కవితమ్మ పై ఈడి కేసుల కుట్రలు చేస్తున్నారు,అంబానీ ఆదానీలకు వంతపడుతున్న మోడీ ఎయిర్పోర్ట్,బొగ్గు స్కాములు అనేక స్కాములు చేస్తున్నారు,
సభ కన్న ముందు ప్రారంభించినవి జైపూర్ మండలం ఇందారం (ఐ కే ఓసిపీ) వద్ద 37.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం,జైపూర్ మండలం ఇందారం గ్రామం నుండి రామారావ్ పేట్ గ్రామం వరకు 2.80 కోట్ల నిధులతో నిర్మించిన చెరువు కట్ట అభివృద్ధితో పాటు బీటీ రోడ్డు ప్రారంభోత్సవం,జైపూర్ మండలం, ఇందారం గ్రామంలో 4.60 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులతో పాటు గ్రామ సుందరీకరణ పనులకు శంకుస్థాపన,జైపూర్ మండలం పెగడపల్లి గ్రామం వద్ద ఈదుల వాగుపై 3 కోట్ల నిధులతో నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన.జైపూర్ మండల కేంద్రంలో 2.30 కోట్ల నిధులతో కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి,శంకుస్థాపన,జైపూర్,
భీమారం మండల కేంద్రాలలో 5.80 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం,జోడువాగుల (వై జంక్షన్) వద్ద 2 కోట్లతో 250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అర్బన్ ఎకో పార్క్ ప్రారంభోత్సవం,చెన్నూరు పట్టణంలో 21.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ దవాఖానకు శంకుస్థాపన,చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న “చెన్నూర్ బస్ డిపో” నిర్మాణానికి శంకుస్థాపన,చెన్నూరు పట్టణ నడిబొడ్డున ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సి ఎచ్ సి సెంటర్ యందు అదనంగా 2.97 కోట్లతో పలు పనులకు శంకుస్థాపన.


చెన్నూరు పట్టణంలో 2.65 కోట్ల నిధులతో 6.34 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవం మరియు 1.70 కోట్లతో స్టేడియంలోని పలు పనులకు శంకుస్థాపన,చెన్నూరు పట్టణంలో మూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన కుమ్మరి కుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం,చెన్నూరు పట్టణంలో 18 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన నాలుగు లైన్ల ప్రధాన రహదారి మరియు సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం,చెన్నూరు పట్టణం నడిబొడ్డున 2.50 కోట్ల నిధులతో 2 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన కేసిఆర్ పార్క్ ప్రారంభోత్సవం.
చెన్నూరు పట్టణంలో 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం,చెన్నూరు పట్టణంలో 1.50 ఓట్లతో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డ్ ప్రారంభోత్సవం మరియు ఎఫ్ ఎస్ టీ పి శంకుస్థాపన, చెన్నూరు పట్టణంలో 7.20 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవం,చెన్నూరు పట్టణంలో 1.50 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సమ్మక్క – సారలమ్మ మహిళా భవనానికి శంకుస్థాపన,చెన్నూరు పట్టణంలో 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించే పిఎసిఎస్ భవనానికి శంకుస్థాపన,తొలి విడతలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం లోని 77 గ్రామపంచాయతీలలో 13.86 కోట్ల నిధులతో 77 సమ్మక్క సారలమ్మ మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన.చెన్నూరు నియోజకవర్గం లోని 100 గ్రామపంచాయతీలలో 4 కోట్ల రూపాయలతో 100 లైబ్రరీలకు శంకుస్థాపన.చెన్నూరు పట్టణంలో 17.52 కోట్ల నిధులతో 99.98 కిలోమీటర్ల మేర పైప్లైన్ మరియు 10 నీటి ట్యాంకుల నిర్మాణాలతో 7629 గృహాలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించే మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభోత్సవం, అనంతరం చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో చెన్నూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం,17,899 మంది లబ్ధిదారులకు 4.79 కోట్ల అభయహస్తం నిధుల విడుదల, మరియు 24,440 మంది లబ్ధిదారులకు 3.36 కోట్ల విలువగల చెక్కుల పంపిణీ,2016 నుండి 2021 వరకు 38,556 మంది బీడీ కార్మికులకు 18.11 కోట్ల విలువగల చెక్కుల పంపిణీ.చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన,
చెన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాకవి శిరోమణి శ్రీ వానమామలై వరదాచార్యులు వారి విగ్రహ ప్రతిష్టాపన,సమాజంలో అనగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యాభివృద్ధి కొరకు కృషి చేసిన మహాత్ములు మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.ఈ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు,కార్యకర్తలు, నాయకులు,ప్రజాప్రతినిధులు, పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేశారు.ఈ కార్యక్రమాలలో దండే విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్,జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్,రామగుండం కమిషనర్ రేమా రాజేశ్వరి, అధికారులు,ప్రజా ప్రతినిధులు,జడ్పిటిసి,ఎంపీటీసీలు,డిసిఎంఎస్, సర్పంచ్ లు,మార్కెట్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,డైరెక్టర్స్,జిల్లా నాయకులు,మండల నాయకులు, గ్రామ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొంటారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking