బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి.
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని
నర్సంపల్లి గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాల యందు కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం రోజున మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ కత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు. నర్సంపల్లి గ్రామ పరిధిలో గల తండావాసులు పేద, మధ్యతరగతి, వృద్ధులు, పాల్గొని వారికున్న కంటి చూపు లోపాలను వైద్య నిపుణులచే బాగు చేసుకోవాలని కంటి వెలుగును దిగ్విజయం చేయాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంలో నర్సంపల్లి గ్రామంలోని పేద మధ్యతరగతి ధనిక వర్గాలన్నీ బేదాభిప్రాయం లేకుండా వృద్ధులందరూ మరియు కంటి చూపుతో బాధపడుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొని చూపును సరి చేసుకోవాలని ఎక్కువ ఇబ్బంది ఉన్నవారికి కంటి ఆపరేషన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగపరుచుకుంటూ అందత్వ నివారణను ఆరోగ్యమైన తెలంగాణను ఏర్పాటు చేయవలసినదని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ముందుకు తీసుకుపోవాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరీశ్, పాలకవర్గం సభ్యులు, సెక్రెటరీ మహేశ్వరి, వైద్య సిబ్బంది, స్కూల్ టీచర్లు, గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.