ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 30 : మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలోని జెడ్ పి ఎచ్ ఎస్ కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ & రిటైలింగ్ ప్రొడక్ట్స్ పై విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ కానుగంటి లక్ష్మన్ వర్మ ఆర్గానిక్ వ్యవసాయం యొక్క గొప్పదనం,భూసారం దెబ్బ తినడం వల్ల నష్టాలు అదేవిధంగా ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు విద్యార్థులకి ప్రాక్టికల్ డెమో ద్వారా వివరించడం జరిగింది. రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయం వైపు రావడం వల్ల నేలకు కలిగేటువంటి లాభాలు,అదే విధంగా మనుషుల యొక్క ఆరోగ్య విధానంలో వచ్చే మార్పు గురించి వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న, ఉపాధ్యాయులు దాముఖ కమలాకర్,దాసరి శేఖర్,అశోక్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.
