రాజేంద్రనగర్ లో భారీ గా గంజాయి చాక్లేట్స్ గుట్టు రట్టు.

 

4 కేజీల గంజాయి చాక్లేట్స్ సీజ్ చేసిన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.

కోకాపేట్ రాంకీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వద్ద అధికారుల దాడులు. ఓ గదిలో వివిధ బ్రాండ్స్ కు చెందిన గంజాయి చాక్లెట్స్ గుర్తింపు.

ఒడిస్సా కు చెందిన సౌమ్యా రాజన్ అనే వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.

ఒడిస్సా నుండి గంజాయి చాక్లెట్స్ తెచ్చి హైదరాబాద్ లో విక్రయం.

ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల తో పాటు లేబర్స్ కు చాక్లెట్స్ విక్రయం.

ఒడిస్సా లో తక్కువ ధరకు గంజాయి చాక్లెట్స్ తెచ్చిన హైదరాబాద్ ఎక్కువ ధరకు విక్రయం.

విద్యార్థులకు గంజాయి చాక్లెట్స్ ను అలవాటు చేస్తున్న కేటుగాళ్లు.

గంజాయి చాక్లెట్స్ సీజ్…. నిందితుడు అరెస్ట్. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు.

రంగారెడ్డి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమీషనర్ అదేశాల మేరకు దాడులు.

గంజాయి చాక్లెట్స్ దందాను ఎంత కాలం నుండి కొనసాగిస్తున్నాడు? ఎవరెవరికి విక్రయించాడు? అనే సమాచారాన్ని కూపీ లాగుతున్న అధికారులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking