ఉప్పల్ స్టేడియం లో ఓటు హక్కు పై అవగాహన

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి ఏప్రిల్ 5:
కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అదికారి గౌతమ్ పొట్రు వారి టీమ్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం వచ్చే క్రికెట్ మ్యాచ్ వీక్షకులకు పార్లమెంటు ఎన్నికల SVEEP కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్టేడియం లోపల మరియు బయట పాదచారులుకు కనపడే విధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్టాండ్లు ,బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. స్వీప్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీమ్ నోడల్ అధికారి మరియు సిబ్బంది స్టేడియం లోపల పలు ప్రాంతాలలో టీములుగా ఏర్పడి వారికి ఓటు పై అవగాహన కల్పించడంతోపాటు. దేశం కోసం ఓటు… నా మొదటి ఓటు దేశం కోసం.. ఓటు దేశ భవిష్యత్తు కోసం ….ఎన్నికల పర్వం దేశానికి గర్వం …అనే నినాదాలతో చైతన్య పరుస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది నూతన ఓటర్లు, యువతి యువకులు, మ్యాచ్ సందర్భంగా ఫ్లెక్సీల పై ఉన్న సమాచారంతో చూపర్లకు ఆకట్టుకునే విధంగా ఉన్నవి.. ప్రతి ఫ్లెక్సీ ఓట్లను చైతన్య పరచడంతో పాటు సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించడంలో సఫలీకృతం అయినట్లుగా భావించవచ్చు.. స్టేడియం లో జరిగే క్రికెట్ మ్యాచ్ ను ఎన్నికల సందర్భంగా ప్రచారం కార్యక్రమం నిర్వహించడం పలువురు హర్షం వ్యక్తం చేశారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking