భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.శనివారం ఈ సందర్భంగా వెంకట్రావుపేట గ్రామంలో బిజెపి పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం బిజెపి మండల అధ్యక్షుడు బొప్పు కిషన్ మాట్లాడుతూ…రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేయాలని రానున్న కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క నేతృత్వంలో భారతదేశాన్ని విశ్వ గురువుగా రూపొందించే కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాలుపంచుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మండల ఇన్చార్జి శ్రీ కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తోట సతీష్ కుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు తగరపు గంగన్న , సీనియర్ నాయకులు కాండ్రపువంశీ ,బూత్ అధ్యక్షులు దావనపల్లి మల్లేష్,బోడకుంటి నర్సయ్య, కార్యకర్తలు దావనపల్లి సతీష్,దుర్గం తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking