యాసంగి లో సాగు చేస్తున్న పంటలలో చీడ పీడల పై అవగాహన కార్యక్రమము వ్యవసాయ అధికారి సి ఎచ్ ప్రభాకర్ రెడ్డి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం లోని సూరారం రైతు వేదిక లో రైతులకు యాసంగి సాగు చేస్తున్న వరి,మొక్కజొన్న పంటలలో చీడ పీడల పై అవగాహన నివారణ చర్యలు లక్షెట్టిపేట వ్యవసాయ అధికారి తెలియజేయడం జరిగింది. లక్షెట్టిపేట మండలంలో సాగు చేస్తున్న వరి పంట ఎక్కువగా పిలక దశ నుండి చిరుపొట్ట దశలో ఉంది.ప్రస్తుతం వరి పంటలో కాండం తొలిచే పురుగు,సల్ఫైడ్ దుష్ప్రభావం, అగ్గి తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు ఆశిస్తున్నాయి. కాండం తొలిచే పురుగు, సల్ఫైడ్ దుష్ప్రభావం,అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ల యాజమాన్యంపై రైతులు శ్రద్ద వహించాలని.కాండం తొలుచు పురుగు(మొవ్వు చనిపోవడం) పురుగు నివారణకు తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP 400 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 60 మి.లీ. లేదా టెట్రానిలిప్రోల్ 80 మి.లీ. ఒక ఎకరాకు పిచికారి చేయాలి.అగ్గి తెగులు లక్షణాలు తొలి దశలో గమినించినట్లైతే ఎకరానికి టైసైక్లోజోల్+ మ్యంకోజెబ్ 500 గ్రా. లేదా ఐసోప్రోథయోలేన్ 320. మి.లీ. లేదా కాసుగామైసిన్ 500 మి.లీ పిచికారి చేయాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లైతే ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ + టెబుకొనజోల్ 50% (75 WG) 80 గ్రా. లేదా పికాక్సిస్త్రోబిన్ 6.78% + ట్రైసైక్లోజోల్ 20:33% SC 400 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోబిన్ 16.7% + ట్రైసైక్లోజోల్ 33:35% SC 200 మి.లీ. లేదా అజాక్సీస్ట్రోటెన్ 18.2% + డ్రైఫెన్ కొనజోల్ 11.4% ఎస్.సి 200 మి.లీ.ఎకరానికి పిచికారి చేయాలి.కాండం కుళ్ళు తెగులు నివారణ కు గానూ మొక్కల మొదళ్ళు తడిచేలా హెక్సాకొనజోల్ 400 మి.లీ.లేదా ప్రొపికొనజోల్ 200 మి.లీ. ఎకరానికి పిచికారి చేయాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం తగ్గించడానికి పొలాన్ని వెంట్రుక మందం పగుళ్లు వచ్చేంతవరకు ఆరబెట్టి మరల నీటి తడులు ఇవ్వాలి.ఈ అవగాహన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పీ దేవేందర్ రెడ్డి,ఏఈఓ ఇర్ఫాన యాష్మీన్ పాల్గొనడం జరిగింది.