తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ తోనే బిసి ల అభివృద్ధి

– బిసి కులగణన చేయడం హర్షనీయం
– దేశ చరిత్రలో కులగణనలో 3వ రాష్ర్టంగా తెలంగాణ రాష్ర్టం
– కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జు ఖర్గె,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు
– మాజీ మున్సిపల్ చైర్మెన్ కొండన్ సురేందర్ గౌడ్
తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని పూర్తి చేసే దిశలో ప్రభుత్వం అడుగులేస్తుందని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మెన్ కొండన్ సురేందర్ గౌడ్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే 3వ రాష్ర్టంగా తెలంగాణ రాష్ర్టంలో బిసి కులగణన తీర్మాణాన్ని అసెంబ్లీలో ఆమోదించడం సంతోషకరం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జు ఖర్గె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిసి శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధి భారత్ జోడో యాత్రలో ప్రకటించిన విధంగా తీర్మాణం చేయడం జరిగిందని పేర్కోన్నారు. బిసిలకు రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం బిసి లకు 10 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దుల్పుకున్నారని ఆయన ఎద్దేవ చేశారు. కాని కాంగ్రెస్ ప్రభుత్వంలో 150 కోట్లు కేటాయించిందని పేర్కోన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందంగా ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్, కౌన్సిలర్ లు దాయర లింగం, ఆవారి శేఖర్, బొజ్జ పవన్, మంగ మోహన్ గౌడ్, మ్యాకల రవి, గాడి రమేశ్, సంతోష్, జిలకరి లింగం, కిష్టయ్య, మున్నా, సయ్యద్ మున్న, అశోక్ రెడ్డి లతో పాటు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking