హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 20
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమ్మికుంట బాలికల పాఠశాల నుండి కోరపల్లి ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకుల బృందం విద్యార్థులు వచ్చారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎం. హేమలత, జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి హేమలత,మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావిభారత పౌరులని విద్యార్థి దశలోనే పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని మన చుట్టూ జరుగుతున్నటువంటి కొన్ని అనైతిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అని అన్నారు.పట్టణ సీఐ వరగంటి రవి మాట్లాడుతూ ఒకప్పుడు మహా నగరంలో వినిపించేటువంటి మాదకద్రవ్యాలు డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు అలవాటయ్యే యువత నేడు చాప కింద నీరు లాగా డ్రగ్స్ గంజాయి లాంటి పదార్థాలు నేడు పల్లెల్లోకి చేరుకున్నాయని ముఖ్యంగా జమ్మికుంటలో రైల్వే స్టేషన్ ఉండడం వలన మహారాష్ట్ర లాంటి ప్రదేశాల నుండి జమ్మికుంటకు గంజాయి మాదకద్రవ్యాలను సులువుగా రవాణా చేసుకొని నేడు విద్యార్థులకు యువతకు చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్నారని ముఖ్యంగా ఇలాంటి కేసులు ఎన్నో మా దృష్టికి వచ్చాయని గంజాయి అలవాటు పడిన వ్యక్తి ఎంతటి నేరానికైనా వెనుకాడడని ఆ మత్తులో ఏమి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో ఉంటారని ఈ అలవాటున్న వ్యక్తి అనేక రోగాలకు బారిన పడతారని కాబట్టి యువకులు విద్యార్థులు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఎల్లప్పుడూ మంచి మార్గంలోనే నడవాలని విద్యార్థులకు సూచించారు..
