ఎల్.ఆర్.ఎస్.దరఖాస్తుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : లేఅవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్.-2020 లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక అధికారులు,నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులతో ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేసే విధంగా అధికారులు పనులను వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో 39 వేల 512 దరఖాస్తులు రాగా 9 వేల 500 నిషేధిత భూములుగా గుర్తించడం జరిగిందని, ప్రాథమిక స్థాయిలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ పరిధిలో 7 వేల 444 దరఖాస్తులు ఉన్నాయని, 2వ స్థాయిలో పట్టణ ప్రణాళిక విభాగం పరిధిలో 3 వేల 790 దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.3 వేల 745 ఆమోదించబడగా 130 మంది లబ్దిదారులు రుసుము చెల్లించడం జరిగిందని,3 వేల 615 మంది చెల్లించవలసి ఉందని తెలిపారు. మాసాంతంలోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking