ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 21 : పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే అయుష్మాన్ భారత్ అని బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్ అన్నారు. గురువారం ఈ సందర్భంగా బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు వనపర్తి రాకేష్ మాట్లాడుతూ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేద ప్రజల వైద్యం కోసం ప్రవేశ పెట్టిన అయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఆరోగ్య భీమా పథకం లబ్ధిదారులకు గత వారం బిజెపి నాయకుడు సహకారంతో దండేపల్లి మండల కేంద్రంలో గ్రామాల్లో ఉచిత రిజిస్ట్రేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి దండేపల్లి గ్రామాల్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న మందికి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గుండా రవీందర్,యువ నాయకులు తళ్లపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.