సంజయ్ కృషితో స్పాట్ వ్యాల్వేషన్ కేంద్రం ఏర్పాటు

 

జగిత్యాల కేంద్రంపై ఉపాధ్యాయుల హర్షం

ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీచర్లు

జగిత్యాల ప్రతినిధి, మార్చి 23:(ప్రజా బలం) దశాబ్దాలుగా ఆశించిన కల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కృషితో నెరవేరిందని ఇది ఉపాధ్యాయ లోకానికి శుభకరమని ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు అన్నారు. జగిత్యాల ఉపాధ్యాయ రంగానికి ఉగాది శుభకృతి కొత్త ఏడాది తొలిరోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో పదోతరగతి పరీక్ష పత్రాలను దిద్దే సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరి చేసింది. జగిత్యాల జిల్లా ఏర్పాటు నుంచి వ్యాల్వేషన్ సెంటర్ జగిత్యాల లో ఏర్పాటు కోసం ఉపాధ్యాయ సంఘాలు నిరంతరం పోరాడుతున్నాయి. కొత్త జిల్లాలో అన్ని సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దృష్టికి వ్యాల్వేషన్ సెంటర్ సమస్య దృష్టికోచ్చింది. అలాగే పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకణంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే డా. సంజయ్ విద్యాశాఖ మంత్రితో చర్చించి ఇక్కడి ఉపాధ్యాయులు ఎదురుకొంటున్న సమస్యలను వివరించి మూల్యాంఖన కేంద్రం అవసరాన్ని మంత్రి దృష్టికి తెచ్చారు. దరిమిలా ఉగాది పర్వదినం రోజున జగిత్యాల జిల్లా ఉపాధ్యాయ లోకానికి శుభవార్త చేరింది. పదోతరగతి పరీక్ష పత్రాల వ్యాల్వేషన్ సెంటర్ జగిత్యాల లో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఉపాధ్యాయులు ఆనందోత్సవాలతో ఉండగా ఉపాధ్యాయుల పక్షాన సంఘ నాయకులు, బాద్యులు ఎమ్మెల్యే సంజయ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఎమ్మెల్యేను కలిసిన వారిలో పి.ఆర్.టి.యు. ట్.ఎస్. జిల్లా, మండల బాద్యులు ఉన్నారు. వీరిలో జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో పి.ఆర్.టి.యు. ట్.ఎస్. జిల్లా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాళ్ళ అమర్ నాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు లు సన్మానించారు.ఈకార్యక్రమంలో పి.ఆర్.టి.యు.టి.ఎస్. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ.వి.ఎన్. రాజు, వూటూరి మహేష్, సంధి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు పన్నాల లింగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు భూపతి రావు, గుర్రం శ్రీనివాస్, జగిత్యాల రూరల్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ రావు, బొమ్మకంటి శ్రీనివాస్, ధర్మపురి మండల అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, మల్యాల మండల అధ్యక్షులు రత్నాకర్ రావు, జగిత్యాల అర్బన్ మండల ప్రధానకార్యదర్శి శ్యామ్ సుందర్, నాయకులు విజయ్ రావు, తిరుపతి, రాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking