కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు ఆటల పోటీలలో భాగంగా బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీలలో న్యాయవాదులు ఐదు టీం లుగా ఏర్పడి తలపడగా ఫైనల్ లో బి. టీం వర్సెస్ సి టీం ల మధ్య పోటీ జరుగాగ బి టీం విన్నర్ కాగా, సి టీం రన్నర్ గా నిలిచింది. బి టీoలో జి మల్లేశం సృజన్ పటేల్, చందు పటేల్ , టి రఘువీర్ , ఎం రాజేశం , సిహెచ్ కిరణ్ కుమార్ , పులి శ్రీధర్ , కొత్త ప్రకాశ్, ఆరెల్లి రాములు విజేతలుగా నిలిచారు. ఉపాధ్యక్షులు వి మహేందర్ రావు, శ్రీధర్ రావు, కొట్టి తిరుపతి లతో పాటు సీనియర్ జూనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ కు ఇంఛార్జి గా బొజ్జ స్వామి వ్యవహరించారు.