టీ జి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల.వెంకట్.
ఈరోజు సదాశివపేటలో బాబు జగ్జీవన్ రామ్
115 వ జయంతి పురస్కరించుకుని టి జి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల.వెంకట్ పూల మాలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ…..బాబాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు,రాజకీయ వేత్త,గొప్ప సంఘ సంస్కర్తగా ఎనలేని సేవలు అందించిన గొప్ప వక్తి అని నలభై ఏళ్ల పాటు వివిధ శాఖలలో మంత్రి పదవులను నిర్వహించడమే కాక భారత ఉపప్రధానిగా సేవలందించారు.1935 లో అంటరాని వారికి అందరితో సమానత్వం కోసం అల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు.తర్వాత 1937 లో బీహార్ శాసన సభకు ఎన్నికయ్యారు.గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారు.1946లో నెహ్రూ ప్రభుత్వంలో అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.భారత్ పాక్ యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రి గా,రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా,హరిత విప్లవం వ్యవసాయ ఆధునీకరణకు ఆయన చేసిన కృషి ఎనలేనిది యువకులు,విద్యావంతులు వారి అడుగుజాడల్లో నడవాలని ఆయన అన్నారు…ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సోమేష్,పార్లమెంట్ ఇంఛార్జి సందీప్ పాటిల్,జిల్లా మీడియా సెల్ ఇంఛార్జి కట్కం. వీరేష్,నరేష్,పంచలింగా రాజు, సుర్ణ రాజు,తదితరులు పాల్గొన్నారు.