● బాబు జగ్జివన్ రాం చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్..
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఏప్రిల్ 5::
బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.
శుక్రవారం డా బాబు జగ్జివన్ రాం 117 వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్సి సంక్షేమ శాఖ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఆమె, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ శ్రీనివాస్ లతో కలసి కలెక్టర్ దేశ తొలి కార్మిక శాఖ మంత్రి జగ్జివన్ రాం నిలువెత్తు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు.దేశ స్వాతంత్య్ర సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా, సామాజిక సమానత్వం కోసం తన జీవితకాల పోరాటం చేసిన సంస్కరణ శీలియని తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప దార్శనికుడు బాబూజి అన్నారు.
ఆయన దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని, కార్మిక లోక పక్షపాతి అని అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం సాధించడానికి జీవితాన్నే అంకితం చేశారు. నవభారత నిర్మాణానికి ఆయన అలు పెరుగని కృషి చేశారు.సమాజ అభివృద్ధి కోసం ఎన్నో కొత్త చట్టాలు, సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పాత్ర మరువ లేనిదన్నారు.
ప్రజలంతా సమానత్వంతో జీవించేందుకు అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న పథకాల ఫలాలు వారికి అందినప్పుడే ఆయన కల సాకారం అవుతుందని తెలిపారు. మహనీయులు లక్ష్యాల సాధన కోసం మనమంతా పాటుపడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా పరిషత్ సిఇఒ రాంరెడ్డి,
డిసివో సంజీవ రావు,జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సత్యవాణి, లతో పాటు
సీనియర్ సిటిజన్,ఉద్యోగులు ప్రజలు,అభిమానులు తదితరులు
పాల్గొన్నారు.