గుండెపోటుతో గ్రామ సేవకుడు మృతి

తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మున్సిపాలిటీలో వీఆర్ఏ (గ్రామ సేవకుడు) గా పనిచేస్తున్న నీరుడి నారాయణ (75) బుదవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. మృతుడు రెండో వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ మామిడి వెంకటేశం తండ్రి. ఎఫ్డీసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.నారాయణ ఆకస్మిక మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.మృతుడు నీరుడి నారాయణ గ్రామ సేవకుడిగా తూప్రాన్ కు మంచి సేవలు అందించారు.మండల గ్రామసేవకుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసి గ్రామ సేవకుల సమస్యల పరిష్కారం గురించి అవిశ్రాంతంగా పోరాడారు. నారాయణ ఆకస్మిక మృతిపట్ల రెవెన్యూ అధికారులు, సిబ్బంది,గ్రామ సేవకులు,పట్టణ ప్రజలు దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking