దళితబందుపై ప్రతిపక్షాల నీచ రాజకీయం

 

అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే

ప్రజల్లోకి వెళ్లలేకనే అధికార పార్టీపై అనవసర ఆరోపణలు

జడ్పి వైస్ చైర్మన్ హరిచరణ్ రావు

జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 7: (ప్రజా బలం)రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి ఓట్లడిగే మొఖం లేకనే ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ నాయకులు దళితబందు పథకాన్ని అడ్డుపెట్టుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని దమ్ముంటే నిరూపించాలని జడ్పి వైస్ ఛైర్మన్ హరిచరణ్ రావు అన్నారు. గురువారం మెడిపెల్లి మండలంలోని దేశాయ్ పేటలోని స్పైస్ యూనిట్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో హరిచరణ్ రావు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత జాతి ఆర్థికాభివృద్ధికై దళిత బంధు పథకాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మెడిపెల్లి మండలానికి 15 యూనిట్లు రాగా అందులోని దేశాయి పేటలోని ఐదు యూనిట్లను కలిపి స్పైస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళితబందు ఐదుగురు లబ్ధిదారులను కలిపి ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ లో అవినీతి జరిగిందని ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈ యూనిట్లో భాగంగా మిషనరీ, భారీషెడ్డు నిర్మాణానికి ఇతరత్రా కలిపి 29 లక్షలు ఖర్చయ్యాయన్నారు. ఇందులోని ప్రతిపైసా లెక్కలు చూపించేందుకు మేము సిద్ధమని అవినీతిని నిరూపిస్తారా అని ప్రతిపక్ష పార్టీలను హరిచరణ్ రావు నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజలకు చేసిందేమిలేదని రాబోయే ఎన్నికల్లో ప్రజల వద్ద ఓట్లు అడిగే మొఖంలేక అధికారపార్టీపై బురదచల్లే నీచ రాజకీయాలకు దిగరన్నారు. దళిత బందులో అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని హరిచరణ్ రావు అన్నారు. ప్రభుత్వ పథకాలపై నిర్మాణాత్మక సలహాలు, సూచనలు చేయాలని అనవసర, అసత్య ఆరోపణలను మానుకోవాలని జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking