సివిల్‌ సప్లై అధికారిని పుష్పలతను కలిసిన బద్దం సతీష్‌ గౌడ్‌

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:బుధవారంనాడు సివిల్‌ సప్లై అధికారిని పుష్పలత కలిసి పలు సందేహాలను నివృత్తి చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్య మైనవి గతంలో ఫుడ్‌ సెక్యూరిటీ కార్డ్‌ కలిగివుండి కొన్ని కారణాలవలన రద్దు ఐన వాటిని తిరిగి పునరుద్దరన జరుగుతుందా అని అడిగితే నూతన రేషన్‌ కార్డ్‌ కు అప్లై చేసుకోవాలని తెలిపినారు. నూతన రేషన్‌ కార్డ్‌ పొందాలంటే మార్గదర్శకాలను తెలియ చేయాలనీ కోరుతూ మీ సేవ మరియు ఆన్లైన్‌ ద్వారా ఆఫ్‌ లైన్‌ ద్వారా కూడా దరఖాస్థులను స్వీకరించాలని కోరడం జరిగినది. కొంతమంది దళారులు దరఖాస్థులను 200,100, రూపాయలకు విక్రాయించాడాన్ని అరికట్టాలనీ కోరడమైనది అని తెలిపిన బద్దం సతీష్‌ గౌడ్‌ మేఘ గ్రేటర్‌ హైదరాబాద్‌ డెవలప్మెంట్‌ ఫోరమ్‌ కన్వీనర్‌, నాఘభూషణ చారీ కో కన్వీనర్‌ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking