ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ నియోజకవర్గ జనవరి 22:
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి. రఘునాథస్వామి పలు ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు .
ఈ సందర్శనలో భాగంగా, భగత్‌సింగ్ నగర్ (చెంగిచెర్ల)లోని బస్తీ దవాఖాన,
మెడిపల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, మరియు
నారాపల్లిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్‌లను పరిశీలించారు.
ఈ సందర్శనలో,
గర్భిణీ స్త్రీల పరీక్షలు, ప్రసవాలు, ల్యాబ్ సేవలు, రోగ నిర్ధారణ, ఫార్మసీ స్టాక్‌లు,
టీకాలు మరియు మందుల నిల్వలను సమీక్షించారు. అదనంగా, ఆపరేషన్ థియేటర్లు మరియు లేబర్ రూమ్‌ల పనితనం మరియు అవసరాలను పరిశీలించారు.
డాక్టర్ రఘునాథస్వామి అన్ని వైద్య అధికారులకు సమయపాలన కచ్చితంగా పాటించాల్సిందిగా ఆదేశించారు. అలాగే, మందుల నిల్వలను పర్యవేక్షించి, జిల్లా డ్రగ్స్ స్టోర్ నుండి అవసరమైన మందులను సేకరించాల్సిందిగా ఆదేశించారు.
తెలంగాణ రాష్ట ప్రభుత్వ తరఫున ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అందించే అన్ని ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడాలని, ఏదైనా నిర్లక్ష్యం కనబడితే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.