ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 6 :
మందమర్రి పట్టడానికి చెందిన దాసరి శ్రావణ్ కుమార్ చేస్తున్న సామాజిక సేవలకు గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు దక్కింది. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు నల్లాల రాధాకృష్ణ జాతీయ అవార్డును శ్రావణ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా దాసరి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నేను చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని ఆయన పేర్కొన్నారు. హ్యాపీ ఎవరు బాధ్యతలు జాతీయ అవార్డు సాధించిన దాసరి శ్రావణ్ కుమార్ ను పలువురు అభినందించారు.