ప్రోటోకాల్ పాటించకుండా, మెజారిటీ నాయకుల అభిప్రాయాన్ని గౌరవించకుండా అవమానించింది మీరే కాదా..?
అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష నాయకుల మాటేందుకు వింటున్నారు..?
అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు రాందాస్ సమాధానం చెప్పాలి.
అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు డిమాండ్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 06 : కొంతమంది తమ స్వార్థం కోసం అంబేద్కర్ సంఘాన్నే బలి చేస్తారా అని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు.సోమవారం పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…పట్టణంలోని రోడ్లు వెడెల్పు చేయాలని మున్సిపల్ అధికారులకు వినతిపత్రం ఇస్తే మీరెందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.వార్డు కమిటీలు వేసి సంఘాన్ని బలోపేతం చేద్దామంటే ఆడుకున్నది మీరే కదా.రోడ్డు కాంట్రాక్టర్ భవనాన్ని వాడుకున్నందుకు అంబేద్కర్ భవనానికి ఇస్తానన్న సిమెంట్, ఇసుక, కంకర ఏ కాకులు ఎత్తుకు పోయాయో సంఘ సభ్యులకు తెలపలన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నాయకులకు అనుకూల నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించకుండా,ఏకపక్షంగా నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు.నిజమైన అంబేద్కర్ వాదులు తమ స్వార్థాన్ని వదిలి ప్రజా సమస్యలపై పోరాడు తారన్నారు.పట్టణ కమిటీ అదే చేస్తుందని,పట్టణంలో ఉత్కూర్ చౌరస్తాకు అంబేద్కర్ చౌక్ గా నామకరణం చేయాలని,ఎండలో నిల్చున్న ప్రయాణికులకు బస్ షెల్టర్ లు నిర్మించాలని,రోజు రోజు పెరుగుతున్న వాహనాల వల్ల ట్రాఫిక్ ఎక్కువైయిందని,రోడ్డు వెడెల్పు చేయాలని,ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించామని తెలిపారు.మండల కమిటీ అధ్యక్షులు ఏమీ చేశారో సంఘ సభ్యులకు చెప్పాలన్నారు. ఎక్కడ ఒక్క గ్రామ కమిటీ వేసిన పాపాన పోలేదన్నారు. దండలేసి దండం పెట్టడం తప్ప మీ నాయకత్వంలో జరిగింది శూన్యమన్నారు.గత మూడేళ్ళ నుండి భవనం అలాగే ఉందని, మీకేమైన చిత్తశుద్ధి ఉంటే ఆ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంశం పైన బహిరంగ విచారణకు మండల అధ్యక్షులు రాందాస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. పట్టణ కమిటీని రద్దు చేసే అధికారం మండల కమిటీకి లేదని, పట్టణ కమిటీ ఎల్లప్పుడూ కొనసాగుతుందని, పట్టణ కమిటీ సభ్యులు ఆందోళన చెందావద్దన్నారు.అంబేద్కర్ వాదులు, మేధావులు, ఉద్యోగ సంఘ నాయకులు, బహుజనులు తప్పుడు మాటలు వినొద్దని, నిజానిజాలు పరిశీంచాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, పెండెం రాజశేఖర్,కండె మొగిలి,మగ్గిడి సాయి, అలుగునూరి నరేష్,బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.