-కమీషనర్ కు విన్నవించిన ఆది జాంబవ సంఘం
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, జనవరి 6 :
మందమర్రి పట్టణంలోని సింగరేణి హై స్కూల్ ముందర గల కోల్ బెల్ట్ రహదారిపై ఉన్న ఇనుప బెడ్ ను తొలగించాలని కోరుతూ ఆది జాంబవ సంఘం నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ నీలిగొండ వెంకటేశ్వలును కలిసి వినతిపత్రం అందజేశారు. ఇనుప బెడ్ ఉండడం వల్ల రాత్రి వేళ ప్రమాదాలు జరుగుతున్నాయనీ వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మందమర్రి మార్కెట్, పాలచెట్టు ఏరియాలలో ఆదివారం రోజున జరిగే మార్కెట్ కు చాపల మార్కెట్ కి వెళ్లేందుకు రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల ప్రజలు, మోటార్, సైకిల్ వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వాటికి పార్కింగ్ స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆది జాంబవ సంఘం ప్రెసిడెంట్ కంబాల రాజనర్సు, వర్కింగ్ ప్రెసిడెంట్ బిధునూరి శంకర్, జనరల్ సెక్రటరీ ఆవునూరి పోశం, ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి రాజనర్సు, విరుగురాళ్ల వెంకటి, రేగుంట రాజయ్య, వేల్పుల రవి, అంతర్పుల మధు లు పాల్గొన్నారు.