సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి
మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :- మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 8 వార్డ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కెటిఆర్ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు సీనియర్ పొలిటిషన్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమ నాయకులు , ప్రజా ప్రతినిధులు సమక్షంలో బలగం మూవీని కన్నుల పండుగగా ఏర్పాటు చేశారు. అచ్చ తెలంగాణ యాస, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా, మన భాష, యాసలకు గౌరవం దక్కే విధంగా తెలంగాణ ముద్దుబిడ్డలు రూపొందించిన అత్యద్భుత గ్రామీణ కుటుంబ కథా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రం ‘బలగం’. ఈ చిత్రం సృష్టించిన సంచలనం ఇంతా కాదు. అంతరించిపోతున్న మానవ సంబంధాల్ని, ఆన్నతమ్ముళ్ళ, అక్కచెల్లెళ్ల అనురాగాల్ని తోడబుట్టిన బంధాల్ని పేగు తెంచి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల కష్టసుఖాల్ని వెండితెరపై ఆవిష్కరించిన విధానం అత్యద్భుతం. గత 20, 30 ఏళ్ళ క్రితం చిన్న టీవీల్లో సామూహికంగా ఏదో ఒక సినిమాను చూసే మనం టెక్నాలజీలో ఎంతో ఎత్తుకు ఎదిగి మల్టీప్లెక్స్ లో, ఓటిటిలో సినిమా చూసే స్థాయికి ఎదిగాం. అయినప్పటికీ ఇలాంటి చిత్రాన్ని ఇప్పటి రోజుల్లో గ్రామ గ్రామాన ప్రదర్శించడం నిజంగా చరిత్రే కాదు, ఓ రికార్డు కూడా. ఇలాంటి గొప్ప చిత్రం గిన్నిస్ రికార్డులోకి ఎక్కినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అలాంటి చిత్రాన్ని తమ గ్రామ ప్రజలకు చూపించి, గ్రామంలో ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తోడికోడళ్ళు, బావ బామ్మర్దుల మధ్య విభేదాలు, కోపతాపాలు, గొడవలు వీడి, అలనాటి ఉమ్మడి కుటుంబాల మాదిరిగా ప్రేమానుబంధాలు పెనవేసుకున్న పొదరిల్లులా వారి జీవితాలు సాగుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మంచి చిత్రాన్ని 8 వ వార్డు లో తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు
పొతురాజు పల్లి దామోదర్ రెడ్డి అద్వర్యంలొ ప్రదర్శించిన బలగం సినిమా ను వార్డు సభ్యులు గ్రామస్తులంతా ముక్త కంఠంతో జేజేలు పలికారు. కష్టనష్టాలుకోర్చి గ్రామపంచాయతీని మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 8 వార్డుని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నప్పటికీ, మరోవైపు సొంత ఖర్చులతో గ్రామస్తులందరి వినోదం, విజ్ఞానం, మానవ సంబంధాల విలువలను గ్రామస్తులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఉత్సాహంతో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు దామోదర్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని కౌన్సిలర్ రాముని గారి శ్రీశైలం గౌడ్, ఉద్యమ నాయకులు మండలంలోని పలువురు ప్రజలు, నాయకులు, ప్రముఖులు కొనియాడారు. ఎప్పుడో చిన్నప్పుడు ఊరిలో బాగోతాలు అడితే వాడకట్టోల్లంతా గుమి గూడి, ఏగబడి కంటికి రెప్ప లేకుండా తెల్లరే దాక భాగవతాలు, సినిమాలు, చూసేటోళ్ళు. ఇప్పుడు బలగం సినిమాతో పల్లెలకు ఎనుకటి కల వచ్చిందని, బలగం చిన్నదైనా సందేశం గొప్పదని, బంధాలు రక్తసంబంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో బలగం చూస్తే తెలుస్తోందని మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 8 వార్డు కు చెందిన సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి అన్నారు. తమ ఊరైనా 8 వార్డు లో బలగం సినిమా వేస్తే చూసేందుకు ఊరు ఊరంతా దసరా జమ్మికి వచ్చినంత సంతోషంగా కదిలి వచ్చి ఆత్మీయ బంధాలను చూస్తూ కన్నీరు కార్చిండ్రు. అంతే కాదు చివరి (క్లైమాక్స్) సీన్ చూస్తే ప్రతి ఒకరి కంట కన్నీళ్లు వచ్చాయి. ఆరేళ్ళ పాటు నుండి అరవై దాటిన వృద్ధుల వరకు సినిమా ఆసాంతం తమ కండ్లను తుడుచుకుంటూ ఇంటి దారి పట్టారు. బంధాలు ఎలా ఉండాలో బలగం మరోసారి గుర్తు చేసింది. బలగాన్ని తెలంగాణ బలగమంతా చూడాల్సిన అవసరముందని బిఆర్ పార్టీ జిల్లా నాయకులు పొతురాజు పల్లి కమాన్ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సినిమాను తిలకించడానికి 8 వార్డు ప్రజలే నుండే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి వీక్షించారు. డబ్బులు ముఖ్యం కాదని, డబ్బులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయని కానీ ప్రజలకు ఓ మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించానని ఆత్మసంతృప్తికి మించిన తృప్తి మరొకటి లేదని, ఒక మంచి సినిమాలు ప్రజలకు అందించాను అనే సంతృప్తి బలగం సినిమా ద్వారా మిగిలిందని సీనియర్ ఉద్యమ నాయకులు దామోదర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. సినిమాలు తిలకించేందుకు గ్రామంలోని వృద్ధులు యువకులు పెద్దమనుషులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తరలివచ్చి సినిమాను ఆసొంతం చూస్తూ చివరి వరకు కన్నీటి పర్యటమై ఇంట్లోకి భారమైన హృదయాలతో ఇంటికి వెళ్లారు. ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానంటూ 8 వార్డు ప్రజా ప్రతినిధి దామొదర్ రెడ్డి
గ్రామ వార్డు ప్రజలకు తోడుండే గ్రామ ప్రజలు బలగం, బంధు గణం*. ఏదేమైనప్పటికీ పోతురాజు పల్లి దామొదర్ రెడ్డి
కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వార్డు సభ్యులు, ప్రజా ప్రతినిధులు అభినందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు కౌన్సిలర్ రామునీ గారీ శ్రీశైలం గౌడ్, మన్నె శ్రీనివాస్, గడ్డం ప్రశాంత్ కుమార్, మహేష్ యాదవ్, తూప్రాన్ మున్సిపాలిటీ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు
సరాప్ సతీష్ చారి, వెంకట్ ,బాయికాడి ఆంజనేయులు, నవీన్,చారి,సాంబయ్య, నరేష్, మహిళలు , వార్డు ప్రజలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.