నాచినపల్లి కొత్తచెరువులో మట్టి దొంగలు.

 

జెసిబి , 20 ట్రాక్టర్లలో యదేచ్ఛగా మట్టి తవ్వకాలు

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఇరిగేషన్, పోలీసు, రెవెన్యూ అధికారులు

చెరువును రక్షించలంట్టున్న గ్రామస్తులు

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలోని కొత్త చెరువులో అక్రమ మొరం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. చెరువులోని మట్టిని జెసిబి లతో అక్రమంగా తోడేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు.గ్రామంలోని చెరువును ఎక్కడ పడితే అక్కడ యదేచ్చగా తవ్వేస్తు కాసులే పరమావధిగా మట్టిని అమ్ముతున్నారు. భావితరాలకు అన్నం పెడుతు సాగుకు ఉపయోగపడే చెరువును బావులను తలపించేలా వాలు పట్టి ఇష్టారీతిన తవ్వేస్తూ పెద్ద పెద్ద గోతులను తయారు చేస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేనప్పటికీ ప్రతిరోజు యదేచ్చగా 20 ట్రాక్టర్లలో 200 ట్రిప్పుల మేరకు అమ్ముతూ జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడకుండా మిన్నకుండ్డడం పై సర్వత్ర గ్రామస్తుల నుంచి తీవ్ర విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. జెసిబి చెరువులో మట్టిని తవ్వుతూ ట్రాక్టర్ డ్రైవర్ల వద్ద నుండి జెసిబి మిషిన్ కి 150, మట్టికి 100 చొప్పున ఒక్కో ట్రిప్పుకు 250 రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తు ప్రైవేటు వ్యక్తులు వేలు గడిస్తు గ్రామ ఆదాయానికి గండి కొడుతున్న సంగతి కళ్ళముందే కనిపిస్తున్న గ్రామ సర్పంచ్ గాని, గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ మిన్న కుండడం లో ఆంతర్యం ఏమిటని ఊళ్లో జనం గుసగుసలాడుకుంటున్నారు. గతంలో ఇలాంటి గోతులు తవ్వడం వల్ల వర్షాకాలం ఆ గోతుల్లో నీరు నిండి ఆ నీటి గుంతల్లో పడి ఎంతోమంది చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ మొరం దొంగల తీరు మారడం లేదు వందల ఎకరాల సాగుకు ఉపయోగపడే నాచినపల్లి కొత్త చెరువు లో మట్టి తవ్వేస్తున్న మట్టి దొంగలపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోనీ చెరువునీ రక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking