పార్కింగ్ స్థలం ఆక్రమణలను తొలగించిన అధికారులు :
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 23:
వరంగల్ చౌరస్తా లోని వర్ణం షాపింగ్ మాల్ పై బల్దియా అధికారుల కొరడా జూలిపించారు. గత కొన్ని రోజులుగా ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు
గ్రేటర్ వరంగల్ లోని వరంగల్ చౌరస్తా లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి పార్కింగ్ స్థలంలో సైడ్ బిజినెస్ లు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండడంతో గత పది రోజుల క్రితం నోటీసులు అందజేసిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం వర్ణం షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న భవనం పై బల్దియా అధికారులు తెల్లవారు జామున కొరడా ఝలిపించారు. టౌన్ ప్లానింగ్ అధికారి వెంకన్న పర్యవేక్షణలో షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ స్థలాల ఆక్రమణ ను జెసిబిల సహాయంతో తొలగించారు. ఇప్పటి వరకూ అకుపెన్సి సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్సియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్య కలాపాలు నిర్వహిస్తూ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకొని దర్జాగా కబ్జా చేయడమే కాకుండా గ్రేటర్ వరంగల్ లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ప్రజలకు ఇబ్బందులు పాలు చేస్తుండడంతో చర్యలు తీసుకున్నాట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు తెలియజేశారు. జి డబ్ల్యు ఎం సి పరిధి లో చేపట్టిన కమర్షియల్ కాంప్లెక్స్ ల అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూల్చి వేసే దాకా వేచి చూడొద్దని సిటీ ప్లానర్ బానో తు వెంకన్న హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఏ ఒక్కరిని ఊపెక్షించ భోమని , పలు షాపింగ్ మాల్స్ లలో స్టిల్ట్ కొరకు నిర్మించిన దానిలో పార్కింగ్ కు కాకుండా నిర్మాణాలు ఉన్నట్లైతే వెంటనే తొలగించుకోవాలని, తమ బృందం వచ్చి కూల్చే అవకాశం ఇవ్వొద్దని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.