కాంగ్రెస్ నాయకుల డిమాండ్
దిష్టి బొమ్మ దహనం, పోలీస్ స్టేషన్లో పిర్యాదు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ బే షరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుమన్ దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ…ప్రజా ప్రతినిధిగా పనిచేసిన నీకు ఎలా మాట్లాడాలో తెల్వక పోవడం శోచనీయమన్నారు.కేసీఆర్ కు బానిసగా ఉండాలంటే ఉండు కానీ రేవంత్, కాంగ్రెస్ జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింత అశోక్, ఆరిఫ్, చెల్ల నాగభూషణం,అన్నం చిన్నన్న,గడ్డం శ్రీనివాస్, త్రిమూర్తి,పెద్ద వెంకటేష్, సాహిద్,పింగళి రమేష్,అంకతి కిషన్,శ్రీనివాస్,కారుకురి సత్తయ్య,బోప్పు సత్తిష్,రాందేని చిన్న వేంకటేష్ వివిధ గ్రామాల నాయకులు,మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
